ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో వైసీపీ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి స్థానంలో వైసీపీ అభ్యర్థిగా మొదట కటారి అరవిందా యాదవ్‌ను సీఎం జగన్ నియమించారు. తరువాత ఆమె రాజకీయం పట్ల, కందుకూరు నియోజకవర్గం పట్ల ఆసక్తి చూపకపోవడంతో ఆ స్థానంలో బుర్ర మధుసూదన్ పేరు ప్రకటించింది. దీంతో మహీధర్ రెడ్డి తీసుకునే నిర్ణయంపై టీడీపీ, వైసీపీ నేతలతో నియోజవకర్గ ప్రజలకు ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. మహీధర్ రెడ్డి వైసీపీలో ఉంటారా ? లేక టీడీపీలో చేరుతారా అన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే పార్టీ మార్పు విషయంలో కందుకూరు YCP MLA మానుగుంట మహిధర్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది. పలు దఫాలుగా అభిమానులతో పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీకి చేరిన కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఇప్పటికే మానుగుంట మహిధర్ రెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం జరుగుతోంది.
రోజుకో మలుపు తిరుగుతున్న కందుకూరు రాజకీయం
0
223
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


