28.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

‘కళావేదిక- ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్’ రేపే

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటి నటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 , హైదరాబాద్ లోని హోటల్ “దసపల్లా” లో నందు అవార్డుల ప్రధానోత్సవం అతిరధమహారథుల సమక్షంలో జరగనుంది. ఈ కార్యక్రమం పోస్టర్ లాంచ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీద జరిగింది. ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క), సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, హీరో నారా రోహిత్, హీరోయిన్ అనన్య నాగళ్ళ, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా ఇంకొంత మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ “విశ్వవిఖ్యాత, పద్మశ్రీ డాక్టర్. నందమూరి తారక రామారావు గారు పేరు మీద అవార్డ్స్ ఫంక్షన్ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈవెంట్ కి ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలంగాణ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, దనసరి అనసూయ (సీతక్క) గారికి, దర్శకులు బోయపాటి శ్రీను గారికి, నారా రోహిత్ గారికి, రాహుల్ సిప్లిగంజ్ గారికి, అనన్య నాగళ్ళ గారికి, మరియు మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తున్నా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ నెల 29న సినీ ప్రముఖులు, NTR గారి అభిమానులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందింగా విన్నపం” అని అన్నారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్