మరోసారి గొప్ప మనసు చాటుకున్న జూనియర్‌ ఎన్టీఆర్‌

కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు నటుడు జూనియర్ ఎన్టీఆర్‌.. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం కోటి విరాళంగా ఇచ్చారు. ఈమేరకు తన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపారు.

Latest Articles

పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందే- ఎగ్జిబిటర్లు

తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక సమావేశం జరిగింది. తెలుగు ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో వస్తున్న పెద్ది సినిమాకు పర్సంటేజ్‌ కావాల్సిందేనని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్