కష్టాల్లో ఉన్నవారికి సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు నటుడు జూనియర్ ఎన్టీఆర్.. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం కోటి విరాళంగా ఇచ్చారు. ఈమేరకు తన ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన వరద బీభత్సం తనను ఎంతగానో కలచివేసిందన్నారు. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలంతా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరొక 50 లక్షలు విరాళంగా ప్రకటిస్తున్నానని తెలిపారు.