తుది శ్వాస విడిచిన ఉమ్మడి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌

      ప్రజా రవాణా వ్యవస్థలో 34 ఏళ్ల పాటు విశేష సేవలందించిన ఉమ్మడి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌(రిటైర్డ్) శ్రీ జ‌గ‌దీశ ప్ర‌సాద్ గారు (83) మరణించారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఆయన మృతి చెందారు. జ‌గ‌దీశ ప్ర‌సాద్ గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 1965లో కొవ్వూరు డిపో మేనేజ‌ర్‌గా ఆర్టీసీలో ఉద్యోగ బాధ్య‌త‌లు చేప‌ట్టిన ఆయన.. అంచెలంచెలుగా ఎదిగి 1995లో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ (క‌డ‌ప) గా ఉన్న‌త స్థాయికి చేరుకున్నారు. ఒకవైపు సమర్థ వంతంగా విధులు నిర్వర్తిస్తూనే.. త‌న పిల్ల‌ల‌ను కూడా ఉన్న‌తంగా తీర్చిదిద్దారు. తన పెద్ద కుమారుడు 1995 బ్యాచ్ కు చెందిన AYV కృష్ణ, ఐపీఎస్ గారు ప్రస్తుతం CRPF అదనపు డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారు. కుమార్తె గీతా గారు టెక్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ గా, చిన్న కుమారుడు ఫణి శ్రీనివాస్ జేపీ మోర్గాన్ లో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నత హోదాలో ఉన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రస్థానంలో జ‌గ‌దీశ ప్ర‌సాద్ గారి జీవనం స్ఫూర్తిదాయకం. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ.. వారికి మ‌నో ధైర్యం ప్ర‌సాదించాలని ఆ భ‌గ‌వంతుని ప్రార్థిస్తున్నాను.

Latest Articles

సరికొత్త సంచలనాలకు తెరలేపిన బొద్దింక జనతా పార్టీ

సోషల్ మీడియాలో వైరల్ కావడం చాలా సులువు. ఈ రోజుల్లో చీఫ్ జస్టిస్ ఓ కేసు సందర్భంగా చేశారంటున్న వ్యాఖ్యల నేపథ్యాన్ని వాడుకుని గత వారంలో కొత్తగా రెండు రాజకీయ పార్టీలు ఆవిర్భవించాయి....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్