Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

కర్నూలు జిల్లా వైసీపీలో మార్పుల మంటలు

      కర్నూలు జిల్లాలో వైసీపీ అధినేత, జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మార్పులు, చేర్పులు తీవ్ర దుమారం లేపుతున్నాయి . ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాష్ బాషాను ఎంపిక చేయ టం పట్ల ఎమ్మెల్లే వర్గీయులు తప్పపట్టుతున్నారు. పార్టీ నిర్ణయంపై ఆగ్రహం, తిరుగుబాటు ధోరణులు వ్యక్తమవుతు న్నాయి. కర్నూలులో సీనియర్ నాయకులు సమావేశమై తమ నిర్ణయాన్ని పార్టీ అధిష్టానానికి తెలియపరిచేందుకు సిద్దపడుతున్నారు. తాజా పరిణామాల పట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

      ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ అభ్యర్ధుల మార్పులు, చేర్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొందరు ఎమ్మెల్లే స్టానాల్లో మార్పులు చేశారు. ఇక మిగిలిన నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. దీంతో ఎప్పడు తాడేపల్లి నుంచి పిలుపు వస్తోందోనని ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్లేల్లో అందోళన వ్యక్తమవుతోంది. అభ్యర్ధి కన్నా, పార్టీయే ముఖ్యమన్న రీతిన వైసీపీ అధినాయకుడు జగన్ అలూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్తలును నియమిం చారు. వీరిలో అలూరు లో మంత్రి గుమ్మనూరు జయరాంను పక్కన పెట్టి జడ్సీటీసీ సభ్యుడు విరూపా క్షను పార్టీ సమన్వయకర్తగా నియమించారు.

     ఎమ్మిగనూరు లో ఎమ్మెల్లే చెన్నకేశవరెడ్డి వయోభారంతో పోటీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మిగనూరు టికెట్ ను ఈ సారి బి.సిలకు కేటాయించింది. కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుకను సమన్వయకర్తగా అధిష్టానం నియమిం చింది. కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్లే డాక్టర్ సుధాకర్ ను కాదని, కర్నూలుకు చెందిన డాక్టర్ అదిమూలపు సతీష్ ను ఎంపిక చేసింది. నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్లే తోగూరు అర్థర్ స్టానంలో కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ధారాను సమన్వ యకర్తగా నియమించారు. వీరిలో ఎమ్మిగనూరు సమన్వయకర్త బుట్టా రేణుక, అలూరు విరూపాక్ష తప్ప మిగిలిన వారెవరూ పార్టీకి సేవ చేసిన దాఖలాలు లేవు. కోడుమూరు, నంది కొట్కూరు సమన్వయకర్తలు 5 ఏళ్లలో పార్టీ చేసిన సేవలేమిటో గుర్తించకుండా ఎన్నికల వేళలో టికెట్లు కట్టబెట్టారని వైసీపీ శ్రేణులల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. తాజాగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం అదే నిర్ణయాన్ని తీసుకోవటం పార్టీ కోసం పనిచేస్తున్న వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతు న్నారు. ఐదుఏళ్లలో పార్టీ కోసం ఎటువంటి సేవ చేయని వ్యక్తుల కు ఎన్నికల సమయంలో పెద్దపీట వేయడం, టికెట్ కేటాయించటం పట్ల వైసీపీ శ్రేణులల్లో తీవ్ర ఆవేదన, అసంతృప్తి వ్యక్తం అవుతోంది. గత ఐదేళ్లుగా పార్టీ కోసం వివిధ కార్యక్రమాల్లో పాల్గొని, పార్టీ పటిష్టత కోసం పనిచేసిన వ్యక్తులకు టికెట్లు కేటాయించాల్సింది పోయి.. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనని, సేవ చేయని వ్యక్తులకు టికెట్లు కేటాయించ డాన్ని వైసీపీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నవేళ అధిష్టానం సృష్టిస్తున్న గందరగో ళం తో ఆందోళన చెందుతున్నారు.

       కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాస్ బాషాను ఎంపిక చేయడాన్ని ఎమ్మెల్లే వర్గీయులు తప్పుపట్టుతున్నారు. కర్నూలు ఎమ్మెల్లే హాపీజ్ ఖాన్ తోపాటు డాక్టర్ ఇలియాష్ ఇరువురు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సియంను కలిశారు. ఈ సందర్బంగా కర్నూలు వైసీపీ సమన్వయకర్తగా డాక్టర్ ఇలియాష్ ను ఖరారు చేసినట్టు సమాచారం. కర్నూలు ఎమ్మెల్లే హాఫిజ్ ఖాన్ మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని సియంను కోరినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు ఉండటంతో ఎన్నికల్లో యస్.వి వర్గం నుంచి సహాయసహాకారాలు అందవన్న సమచారంతో కొత్త అభ్యర్ధి డాక్టర్ ఇలియాస్ బాషాను ఎంపికచేసిన్నట్టు సీఎం తెలిపినట్టు తెలుస్తోంది. గత నాలుగేళ్లుగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్లే హాఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్లే యస్.వి. మోహాన్ రెడ్డి వర్గీయల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్టితి. రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలు నిర్వహించటం, పార్టీ సమావేశాలల్లో వేర్వేరుగా హాజరవటం తదితర చర్యలతో కర్నూలులో వర్గ పోరు తారస్థాయికి చేరింది. రెండు వర్గాలు పోరుతో మూడో వ్యక్తికి లాభం అన్నట్టుగా పార్టీ దెబ్బతి నకుండా ఇద్దరు నేతలను కాదని కొత్త వ్యక్తిని పార్టీ సమన్వయకర్తగా నియమించిన్నట్టు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. పత్తికొండ, పాణ్యం, బనగానపల్లె, శ్రీశైలం, నంద్యాల, అళ్లగడ్డ నియోజకవర్గాలల్లో ఏవిధ మైన పరిమాణాలు చోటుచేసుకొంటాయోనన్న వైసీపీ శ్రేణులతోపాటు కార్యకర్తలలో అసక్తి నెలకొంది.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్