మరో మూడు రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలర్ట్ జారీ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది.

ఆగస్టు 16వ తేదీన  ఈశాన్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీద ఉన్న ఆవర్తనం.. ఈరోజు(ఆగస్టు 17) వాయువ్య బంగాళాఖాతం.. దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుండి  4.5 కిలో మీటర్ల నుంచి 7.6 కిలో మీటర్ల ఎత్తు మధ్యలో కొనసాగుతూ ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాగల 12 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని సూచించింది.

దీంతో నేటి నుంచి  మూడు రోజుల్లో రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పాటు  రాష్ట్రంలో రేపు, ఎల్లుండి(ఆగస్టు 18, 19) ఈ రెండు రోజుల్లో పలు జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్