థియేటర్స్ లో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం భారీ ధర.. క్రేజ్ మాములుగా లేదుగా..!

స్వతంత్ర వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chirajeevi) ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న భోళా శంకర్(Bhola shankar) మూవీ  బాక్సాఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశపరిచింది. మెహర్ రమేష్(Meher Ramesh) దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేక ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు రూ.110 కోట్ల భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కనీసం అందులో సగం కూడా రాబట్టలేకపోయింది. దీంతో మెగాస్టార్ ఖాతాలో ఆచార్య(Acharya) తరువాత మరో బిగ్గెస్ట్ ఫ్లాప్ చేరింది.

అయితే థియేటర్స్ లో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న భోళా శంకర్ సినిమా ఓటీటీలో మాత్రం భారీ ధర పలికింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్  సొంతం చేసుకుంది. ఈ ఫ్లాప్ సినిమా కోసం ఏకంగా రూ.30 కోట్లు చెల్లించిందట నెట్ ఫ్లిక్స్. ఈ న్యూస్ చూసిన నెటిజన్స్ అవాక్కవుతున్నారు. ఒక ఫ్లాప్ సినిమా అది కూడా రీమేక్ సినిమాకు ఇంత ధర పెట్టడం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే.. మెగాస్టార్ ఫ్లాప్ సినిమాకు కూడా డిమాండ్ అస్సలు తగ్గదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి భోళా శంకర్ సినిమాకు మొదటి షో నుండే ఫ్లాప్ టాక్ రావడంతో.. ఈ సినిమాను థియేటర్స్ లో చూడటానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. అందుకే భోళా శంకర్ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దీంతో ఓటీటీలో ఈ సినిమా అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయం. అందుకే ఈ సినిమాకు నెట్ ఫ్లిక్స్ అంత ధర పెట్టారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్