రోహిత్, హార్దిక్ సై అంటే సై.. ఫైనల్ చేరేదెవరో మరి?

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2023లో మరో ఉత్కంఠ పోరుకు రంగం సిద్ధమైంది. ఇవాళ రాత్రి క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ను ముంబయి ఇండియన్స్ ఢీకొట్టనుంది. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన గుజరాత్ జటట్టు క్వాలిఫయర్-1లో మాత్రం చెన్నై చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ఫైనల్‌లో తలపడాలని భావిస్తోంది.

మరోవైపు ముంబయి ఇండియన్స్ కూడా ఎలిమినేటర్‌ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసి మంచి ఊపు మీద ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరోసారి ఫైనల్‌కు అర్హత సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.

ఈ నేపథ్యంలో చెన్నై జట్టు బౌలింగ్ కోచ్ డ్వేన్ బ్రావో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి మ్యాచులో గుజరాత్ మీద ముంబై ఓడిపోవాలని కోరుకుంటానని తెలిపాడు. ముంబై ఫైనల్ చేరితే తనకు భయమని సరదాగా వ్యాఖ్యానించాడు. కాగా గతంలో చెన్నై-ముంబై జట్ల మధ్య ఫైనల్స్‌లో ముంబై కప్ గెలిచింది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్