న్యూజెర్సీలో అంబరాన్నంటిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉగాది వేడుకలు

న్యూజెర్సీ(New Jersey)లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమెరికా తెలుగు సంఘం (ఆటా)  ఆధ్వర్యములో ఎడిసన్ లోని రాయల్ అల్బెర్ట్స్ ప్యాలేస్ లో ఏప్రిల్ 2వ తారీఖున దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది. ఈ వేడుకకు అన్నివర్గాల నుండి సుమారు 1200 మంది ప్రజలు హాజరయ్యారు. ఈ వేడుకను ఆటా అధ్యక్షురాలు శ్రీమతి మధు బొమ్మినేని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆ తరువాత న్యూ జెర్సీ(New Jersey) / న్యూయార్క్  ఆటా  బృందం సాంప్రదాయ పద్దతిలో ఉగాది పూజలను జరుపగా అను దాసరి బృందం ప్రార్థనా గీతాన్ని ఆలపించి శ్రోతలను ప్రేక్షకులను మైమరపింప చేసి ప్రసంసలు పొందారు. ముఖ్యప్రభుత్వ వ్యవహరాల అధికారి,  రాష్ట్రపతికి ప్రత్యేక సహాయకులు (చీఫ్  గవర్నమెంట్  అఫైర్స్  ఆఫీసర్  అండ్  స్పెషల్  అసిస్టెంట్ టు ప్రెసిడెంట్ ) అయిన కెల్లీ డ్రేక్ఫోర్డ్  ముఖ్య అథిదిగా  విచ్చేసి  భిన్నత్వంలో ఏకత్వం, అందరినీ కలుపుకొని  పని చేయటం, మహిళా సాధికారత గురించి ప్రేరణ  కలిగించే విధంగా ప్రసంగించారు. ఈ ప్రసంగానికి  ప్రేక్షకుల మన్ననలు లభించడమే  గాక వివిధ ఛానెల్ లో ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం జరిగింది.

అన్ని వయస్సుల వారి ఫ్యాషన్ షో, ముగ్గుల పోటీలు, పిన్నలు పెద్దలచే వివిధ నృత్య  కార్యక్రమాలు,  క్విజ్ పోటీలు, పిల్లలకు మ్యూజికల్ చైర్స్ వంటి ఆటల  పోటీలు ఇంకా మరెన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి   బహుమతులు, ప్రశంసాపత్రాలు బహూకరించారు. అలానే  స్వఛ్ఛందంగా  కార్యక్రమాలు నిర్వహించిన నేటితరం పిల్లలందరికీ ఆటా అధ్యక్షులు మెమెంటోలు బహూకరించారు. ఈ తరం పిల్లలు, యువత  ఆటాలో వాలంటరీగా వారి పేర్లు నమోదు చేసుకునేందుకు  ప్రాధాన్యత ఇవ్వబడింది.ఇలాంటీ అన్ని ప్రయత్నాలు కూడా సఫలీక్రుతమయ్యాయి.

మహిళలు అంటేనే ధైర్యానికి పెట్టింది పేరు. ఈ  కార్యక్రమం దిగ్విజయం కావడానికి గీతారెడ్డి, మీనాక్షి తునికి, అర్చన వేముల,అను దాసరి, నందిని దర్గుల, కవిత లింగంపల్లి, హరిని ఆఎనూతి, లలిత రెడ్డి, నివేదిత గౌడ్, అపర్న కనుగొ, షిల్పి కుందూర్, స్వప్న తుమల్ల, సరిత ఆర్జుల, జ్యోతి కెథిది, శ్రీదేవి జాగర్లమూడి, శ్రీలత రెడ్డీ, మాధవి ఆరువ, మాధవి గొట్టిముక్కుల, ఉష అప్పిడి, చిత్ర జంబుల వంటి  బృందంలోని మహిళామణులకు ధన్యవాదములు తెలిపింది ఆటా టీం.

న్యూ జెర్సీ(New Jersey)లో ఉన్న మూడు అతి ముఖ్యమైన నాట్యకళాశాలలు వాటి అధ్యక్షులైన సిద్ధేంద్ర కూచిపూడి అకాడమి నడుపుతున్న స్వాతి అట్లూరికి, కళాంజలి స్కూల్ ఆఫ్ డాన్స్  నడుపుతున్న సుధ దేవులపల్లికి,  సెంటెర్ ఫొర్ కూచిపూడి డాన్స్ నడుపుతున్న ఇందిర  శ్రీరాంకి నిర్వహణ బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే పెద్దల నృత్యాల సమన్వయకర్త అయిన శ్రీమతి లలితకి, మూడు విభిన్న వయసు వర్గాలకి నృత్యం కూర్చిన ఎనిమిదవ తరగతి చిన్నారి ఇషిత రెడ్డి మూలేకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, నారాయణ పిరమర్ల, బోర్డు అఫ్ ట్రస్టీ అనిల్ రెడ్డి, ఆట ప్రసారమాధ్యమా చైర్  రామ్ ముందర్తితో సహా వివిధ రాష్ట్రాలకు చెందిన ఆట సభ్యులు విచ్చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా పూర్తి అవ్వడానికి ముఖ్య కారణం ఆట సభ్యుల మధ్య సమన్వయం. ఆట ప్రాంతీయ సమన్వయకర్త గీతా రెడ్డి , మీనాక్షికి, సంతోష్ రెడ్డి, ప్రదీప్ కట్ట, జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, బోర్డు అఫ్ ట్రస్టీలు శరత్ వేముల,  రఘువీర రెడ్డి, వినోద్  కోడూరు, శ్రీనివాస్ దర్గుల, సుధాకర్ పెర్కారి, బిజినెస్ కార్యదర్శి హరీష్ బాతిని, సలహాదారు సురేష్ జిల్లా, ప్రాంతీయ సలహాదారులు రత్నకుమార్ కుదుముల, నారాయణ పిరమర్ల , విలాస్ జంబుల,  ప్రాంతీయ అధ్యక్షులు ప్రవీణ్ ఆల, అంతర్జాల(వెబ్) కార్యదర్శి రాజ్ చిలుముకు నిర్వహణ బృందం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమములో వచ్చిన వారందరికి రాఫల్ ద్వారా బహుమతులు ఇవ్వడానికి సహకరించిన వివిధ దాతలకు, స్పాన్సర్స్ కి విలాస్ జంబుల (ప్రాంతీయ సలహాదారులు ) ధన్యవాదములు తెలిపారు.

ఉగాది పచ్చడితో సాంప్రదాయ మిఠాయిలతో కూడిన విందును కూడా వడ్డించడం జరిగింది . ఈ కార్యక్రమం మొత్తానికి దిగ్విజయంగా జరిగి పలువురి ప్రశంసలు అందుకుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమ నిర్వహణలో ఆటా పెట్టింది పేరు అని పేరు నిలుపుకుంది. అందరూ కూడా ఆటాకు ధన్యవాదాలు తెలియజేశారు. ఆటా స్పాన్సర్స్ కి మరియు ప్రసారమాధ్యమ (ప్రింట్, రేడియో  & ఎలక్ట్రానిక్ ) భాగస్వాములకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read Also: ఎల్లుండి నుంచి జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం

Follow us on:  YoutubeInstagram Google News

Latest Articles

ఈ నెల 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు..డీలిమిటేషన్‌, మహిళ రిజర్వేషన్‌ బిల్లులు

ఈ నెల 20 నుంచి పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్‌ ముందుకు డీలిమిటేషన్‌, మహిళ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్