34.3 C
Hyderabad
Sunday, April 20, 2025
spot_img

స్వతంత్ర సంక్షిప్త వార్తలు

రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి

మహబాబూబాద్ జిల్లా గూడూరు ప్రధాన రహదారిపై తెల్లవారు జామున వెదురుబొంగుల లోడు లారీ బీభత్సం సృష్టించింది. బస్సు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపై పడింది. ఈ ప్రమాదంలో సీఐ గన్‌మెన్‌ పాపారావు, ప్రభుత్వ ఉపాధ్యాయుడు దేవేందర్‌ మృతిచెందారు. దీంతో గూడూరు శోకసంద్రం అయింది. మృతదేహాలను మార్చురీకి తరలించారు.

దొంగలు అరెస్ట్

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వ్యవసాయ క్షేత్రాల్లోని ట్రా న్స్‌ఫార్మర్లలో రాగి వైర్లను దొంగిలించే ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. కంబదూరు మండలం వెంకటంపల్లి, కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లిల్లో ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్లలోని వైర్లు ఎత్తుకెళ్లారు. నిందితులు చాకలి రాఘవేంద్ర, కావలి ఎర్రిస్వామిని పోలీసులు పట్టుకొని, రాగి వైర్లు స్వాధీనం చేసుకున్నారు.

భోగాపురంలో దారుణం

కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మేనమామ తలపై మేనల్లుడు రాయితో కొట్టి చంపాడు. మద్యం సేవిస్తుండగా మేనల్లుడు నాగులపల్లి పద్మరాజును చంపేస్తానని మేనమామ బ్రహ్మదేపు ప్రసాద్ బెదిరించాడు. దీంతో నిద్రిస్తున్న బ్రహ్మదేవును పద్మరాజు హత్యచేశాడని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టారు పిఠాపురం రూరల్‌ పోలీసులు.

విగ్రహాలపై తొలగని ముసుగులు

ఏపీశ్‌లో ఎలక్షన్‌ కోడ్ ముగిసి 8 రోజులు అయినా చింతూరు మండలం మోతుగూడెంలో దివంగత నేతల విగ్రహాలకు ముసుగులు మాత్రం తొలగలేదు. దివంగత దేశ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీ, స్వర్గీయ సీఎం వైఎస్సార్‌ విగ్రహాలకు ముసుగుల తొలగింపులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నా రని స్థానికులు ఆరోపించారు. ఏప్రిల్ 18 నుండి జూన్ 5 వరకు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.

బ్లడ్ డొనేషన్ క్యాంపు

ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్ కమ్యూనిటీ హాల్‌లో బ్లడ్ డొనేషన్ క్యాంపును మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. రక్తదానం మీద ఇంకా అపోహలు ఉన్నాయని, మూడు నెలకొక సారి రక్తాన్ని దానం చేయొచ్చని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటే శం, హెల్త్ కమిషనర్, సెక్రటరీ, రెడ్‌క్రాస్ సొసైటీ సీఈఓ మదన్‌మోహన్ పాల్గొన్నారు.

అన్న క్యాంటీన్లకు మళ్లీ మోక్షం

ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లకు మళ్లీ మోక్షం కలిగింది. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపై సంతకం చేశారు. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలోని అన్న క్యాంటీన్‌ రూపురేఖలు మార్చి, పూర్వ వైభవం తీసుకొచ్చేం దుకు అధికారులు యత్నాలు ప్రారంభించారు.

జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఓపెన్ జిమ్‌

వ్యాయామం శారీరక దృఢత్వాన్ని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఓపెన్ జిమ్‌ను ఆయన ప్రారంభించారు. మార్నింగ్ వాకర్స్‌కు ఎమ్మెల్యే పౌష్టికాహారం అందజేశారు.

రక్తదాన అవగాహన ర్యాలీ

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేములవాడ మొదటి బైపాస్ రోడ్డులో రక్తదాన అవగాహన ర్యాలీ జరిగింది. ర్యాలీని ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ రమణారావు జెండా ఊపి ప్రారంభించారు. రక్తదానానికి ఉత్సాహంగా ముందుకు రావాలని ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు కానిస్టేబుల్ రాజశేఖర్‌గౌడ్ పిలుపునిచ్చారు.

Latest Articles

దర్శకుల సమక్షంలో ‘ఏఎల్‌సీసీ’ బిగ్ టికెట్ లాంచ్

యెల్ ఆర్ ఫిల్మ్ సర్కూట్స్ బ్యానర్‌పై లేలీధర్ రావు కోలా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఏ ఎల్ సి సి’ (ఓ యూనివర్సల్ బ్యాచిలర్). రీసెంట్ గా ఈ సినిమా ట్రెయిలర్ విడుదలై...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్