నీట్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. నీట్ యూజీ వ్యవహారంలో వేర్వేరు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకు బదిలీ చేయాలని ఎన్‌టీఏ పిటిషన్ వేసింది. దీనిపై విచారణను జులై 8కి వాయిదా వేసింది సుప్రీం కోర్టు.
గురువారం ఫలితాల అనంతరం దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణలో గ్రేస్ మార్కులు వచ్చిన విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం ఉంటుందని కోర్టు తెలిపింది. రెండు పిటిషన్లపై కోర్టు ఎన్టీఏ నుంచి స్పందన కోరింది. నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయడం ద్వారా దాన్ని పరిష్కరించ లేమని కోర్టు తెలిపింది. ఈ అంశంపై తదుపరి విచారణ జూలై 8న జరగనుంది. నీట్ ఫలితాల్లో గ్రేస్ మార్కులు, పునఃపరీక్ష, పరీక్ష రద్దుపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రతి అభ్యర్థి మళ్లీ పరీక్షకు దరఖాస్తు చేయరాదని సుప్రీం పేర్కొంది. గ్రేస్ మార్కులు ఇచ్చిన విద్యార్థులు కూడా రెండు ఆప్షన్‌లను కలిగి ఉంటారు. ఈ విద్యార్థులు జూన్ 23న జరిగే పరీక్షకు హాజరుకావచ్చని పాత స్కోర్‌లతో కౌన్సెలింగ్‌కు వెళ్లవచ్చని సుప్రీం తెలిపింది.