రైతుల ఆందోళన
ఉమ్మడి మెదక్ జిల్లాలో జీలుగు జనుము విత్తనాల కొరత ఏర్పడింది. దీంతో రైతులు టేక్మాల్ లోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంవద్ద ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసారు. విత్తనాల కొరత తీర్చాలంటూ డిమాండ్ చేసారు. భూమిలో బలం కోసం రైతులు జీలుగు విత్తనాలు వెదజల్లి పంట వేయడానికి సిద్దమవుతుంటారు.
అధిక వడ్డీ ఆశ చూపి మోసం
అధిక వడ్డీ ఆశ చూపి లక్షల్లో నగదు వసూలు చేసి పరారయ్యాడు మహేశ్ అనే పూజారి. వేములవాడ పట్టణంలో శివసాయిరాం జ్యోతిష్యాలయం నిర్వహిస్తున్న మహేశ్ మాయమాటలకు లక్షల్లో ఇచ్చిన బాధి తులు లబోదిబోమం టున్నారు. జ్యోతిష్యాలయానికి తాళం వేసి ఉండటం, మహేశ్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావ డంతో న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు బాధితులు.
అక్రమ కట్టడాలు
వరంగల్ జిల్లా భీమారం పరిధిలోని చామల చెరువులో వెలిసిన అక్రమ కట్టడాలపై అధికారులు కొరఢా ఝుళిపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమీషనర్ ఆదేశాలతో కట్టడాల్ని గుర్తించి కూల్చివేసారు. టౌన్ ప్లానింగ్, ఇరిగేషన్ సిబ్బంది ఈ కూల్చివేత కార్యక్రమంలో పాల్గొన్నారు.
శభాష్ పోలీస్
కడప జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తీరు వల్ల కడప జిల్లాలో పోలింగ్ శాతం పెరిగిందన్నాయి జిల్లా రాజకీయ పక్షాలు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందంటూ ప్రశంసలు కురిపించారు నేతలు. ట్రబుల్ షూటర్లకు గుబులు పుట్టించడమే కాకుండా వైసీపీ ఎమ్మెల్యే పై కేసు నమోదుకు వెనుకాడలేదని గుర్తుచేసారు. జిల్లా పొలిసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
పోటెత్తిన భక్తులు
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నత్తా రామేశ్వరంలోని రామలింగేశ్వరస్వామిని దర్శించు కునేందుకు భక్తులు పోటెత్తారు. ఏడాదిలో 11 నెలల నీటిలో ఉండి ఒక్క వైశాఖమాసంలోనే భక్తులకు స్వామివారి దర్శనభాగ్యం లభిస్తోంది. దీంతో స్వామికి పంచామృతాలతో అభిషేకాలు, ఏకాదశ రుద్రాభి షేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు చేశారు. స్వామివార్ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తా యని భక్తుల విశ్వాసం.
34 వెహికల్స్ సీజ్
ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం కంభంపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. ACPలు ఎస్. మురళీ మోహన్, కె.ప్రకాశ్ రావు ఆధ్వర్యంలో పోలీసు బృందం ఈ తనిఖీలను చేపట్టింది. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు సరైన పత్రాలు లేని 34 వాహనాల్ని సీజ్ చేసి స్టేషన్ కు తరలిం చారు.
విశాఖలో కార్డన్ సెర్చ్
విశాఖ జిల్లా గాజువాకలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 26 బైకుల్ని సీజ్ చేసారు. 52 లిక్కర్ బాటిల్స్‌ను స్వాధీనపర్చుకున్నట్లు డీసీపీ మేకా సత్తిబాబు చెప్పారు. కౌంటింగ్ పూర్తయ్యే వరకు రౌడీ షీటర్స్ కదలికల పై నిఘా ఉంటుందన్నారు డీసీపీ.
గొర్రెలపై దాడి చేసిన హైనా
గొర్రెల మంద పై హైన అనే అడవి జంతువు దాడి చేసింది. దాడిలో 65 గొర్రెలు మృత్యువాతపడగా, మరో 20 గొర్రెలు గాయపడ్డాయి. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలంలో ఈ ఘటన జరిగింది. ఘటనతో మాచాపూర్ కి చెందిన గొర్రెల యజమాని లబోదిబోమంటూ అటవీ శాఖ సిబ్బందికి సమాచారమిచ్చాడు. మూడు లక్షల రూపాయల మేరకు నష్టం వాటిల్లినట్లు యజమాని పేర్కొన్నాడు.
డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల వేదికగా డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న ట్లు లీగ్ కన్వీనర్ డాక్టర్ ప్రసన్నకుమార్ చెప్పారు. రేపటి నుండి పది రోజులపాటు జరగనున్న ఈ టోర్న మెంట్‌లో 150 మంది వైద్యులు ఆరు టీములుగా ఏర్పడి పోటీలలో పాల్గొంటున్నట్లు వివరించారు. వృత్తి లో బిజీగా ఉండే వైద్యులకు ఈ టోర్నమెంట్ రిలీఫ్ ఇస్తోందన్నారు ప్రసన్నకుమార్.
కత్తి కర్ర సాము
విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించడానికి పురాతన కళలైన కత్తి, కర్ర సాముల నైపుణ్య ప్రదర్శన సిద్ధవటంకోటలో జరిగింది. కడప జై చంద్ర అకాడమీ ఈ కార్యక్రమం నిర్వహించగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నైపుణ్యంతో పాటు ప్రతి విద్యార్థిని విద్యారంగంలో ఉన్నత స్థాయికి ఎదిగేలా తోడ్పడుతున్నామన్నారు అకాడమీ ఛైర్మన్ జయచంద్ర.
ఇసుకలో అప్పడాన్ని కాల్చిన జవాన్
రాజస్ధాన్‌లోని బికనేర్‌లో విధులు నిర్వర్తిస్తున్న BSF జవాన్ చేసిన 47 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఇసుకలో అప్ప డాన్ని కాల్చాడు. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయ్యింది. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎలాంటి అసాధారణ పరిస్ధితులకైనా వెరవకుండా దేశం కోసం సేవలు అందిస్తోన్న జవాన్లను చూసి నా హృదయం కృతజ్ఞత, గౌరవంతో నిండిపోయిందంటూ BSF ఇండియాను ట్యాగ్ చేసారు.