Kodali Nani: అలా ఎవరైనా చేస్తే.. బట్టలూడదీసి రోడ్డుమీద నిలబెడతాం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రాజెక్టుల పరిశీలన పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విచిత్ర విన్యాసాలు చేస్తున్నాడని గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చాక ఎక్కువ కాలం ఏపీలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్‌, టీడీపీలేనని.. కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ అడ్డమైన పనులు చేశాడని, చివరకు ఎన్టీఆర్‌ కాళ్లు ప్టటుకుని టీడీపీలో చేరాడని చంద్రబాబుపై మండిపడ్డారాయన. చంద్రబాబు నుంచి వెన్నుపోటు తప్పదంటూ జనసేనాని పవన్‌కల్యాణ్‌ను కొడాలి నాని హెచ్చరించారు.

చంద్రబాబు వెల్‌ విషర్స్‌ అంతా ఇప్పుడు పవన్‌కు సపోర్టర్స్‌గా ఉన్నారు. రామోజీరావు, బీఆర్‌ నాయుడు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, లింగమనేని, నాందెండ్ల మనోహర్‌.. అంతా చంద్రబాబు వల్ల లబ్ధిపొందినవాళ్లే. చంద్రబాబు ఎప్పుడూ సీఎంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు వీళ్లు. అలాంటి వాళ్లు పవన్‌ పక్కన చేరారు.  ఎన్టీఆర్‌ లేకపోతే ఈ బఫూన్‌ చంద్రబాబు ఎక్కడ ఉండేవాడు?. జీవితాన్ని ఇచ్చిన ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచాడు. బాబును నమ్ముకుంటే నీకు కూడా అదే గతి పట్టిస్తారు అంటూ పవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన.  చంద్రబాబులో అణువణువునా వెన్నుపోటు ఉంది. అవసరానికి వాడుకోవడం ఉంది. ఇదే విషయాన్ని పవన్‌ను నేరుగా కలిసి చెప్పాలనుకున్నా. కానీ, కుదరలేదు. ఆయన అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. కాబట్టి, చంద్రబాబు ఎలాంటివాడో ఇప్పటికైనా తనంతట తానుగా తెలుసుకోవాలి అని పవన్‌కు కొడాలి నాని సూచించారు.

పవన్ కళ్యాణ్ మూడవ విడత వారాహియాత్ర చేయడం వల్ల ఎవరికీ అభ్యంతరం లేదు. ఎన్నికలయ్యే వరకూ పవన్ ఈ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగితే అభ్యంతరం లేదు.   పవన్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తప్పులు ఎత్తిచూపినా.. సీఎం జగన్ పై విమర్శలు చేసినా అభ్యంతరం లేదు. కానీ చంద్రబాబు 420 బ్యాచ్‌తో కలిసి రాజకీయ దాడికి దిగితే మాత్రం ఊరుకునేది లేదు. చంద్రబాబును సపోర్ట్ చేసే ఎవరినైనా రాజకీయంగా బట్టలూడదీసి రోడ్డుమీద నిలబెడతాం. ఒకవేళ చంద్రబాబు స్క్రిప్ట్‌ పవన్‌ అమలు చేయాలనుకుంటే.. మాత్రం ఎదుర్కొంటాం అని కొడాలి నాని స్పష్టం చేశారు.

Latest Articles

జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో కూటమి సర్కార్‌కు షాక్‌ తగిలింది. సీఐడీ స‌మ‌ర్పించిన చార్జిషీట్‌లో దిమ్మ‌తిరిగే వాస్త‌వాలు బయటకు వచ్చాయి. జెత్వానే అతి పెద్ద బ్లాక్‌మెయిల‌ర్ అని సీఐడీ తేల్చింది. విజయ‌వాడ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్