చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు- కొడాలి నాని

స్వతంత్ర వెబ్ డెస్క్: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గుడివాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, చిరంజీవి అభిమానులకు అందించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ…ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని ఛాలెంజ్ చేశారు. నేను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయి. నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు.. మేమంతా క్లారిటీగానే ఉన్నాం అని అన్నారు.

రాజకీయంగా చిరంజీవిని విమర్శిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు. జగన్ గురించి, తన గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతాను. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదంటూ కొడాలి నాని అన్నారు. చిరంజీవి అభిమానుల ముసుగులో టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొర్లారు. చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన నేతలు కుట్రలు చేశారని  కొడాలి పేర్కొన్నారు. ప్రజారాజ్యం తరపున చిరంజీవి ప్రచారం సమయంలో తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి నేను చేతులెత్తి నమస్కారం పెట్టాను. ఆయనను అనేక సందర్భాల్లో నేను కలిశాను. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని కొడాలి నాని అన్నారు.

Latest Articles

ఎమ్మెల్యేగా కొనసాగుతా.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తి లేదు- సిద్ధరామయ్య

జాతీయ స్థాయి రాజకీయాల్లో తనకు ఆసక్తి లేదని సిద్ధరామయ్య తెలిపారు. తాను రాష్ట్ర రాజకీయాల్లోనే కొనసాగుతానని అన్నారు. అధిష్టానం రాజ్యసభ సీటు ఆఫర్ చేసినా తాను సున్నితంగా తిరస్కరించానని చెప్పారు. హైకమాండ్‌ ఆదేశాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్