32.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

నిమజ్జనంలో భక్తులతో కలిసి హైదరాబాద్ మహిళా పోలీసుల సూపర్ డ్యాన్స్

స్వతంత్ర వెబ్ డెస్క్: హైదరాబాద్ లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం నిన్నటి నుంచి కొనసాగుతోంది. నిన్న జరిగిన శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు ఈ శోభాయాత్ర కోలాహలంగా సాగింది. వేలాది విగ్రహాలను ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేశారు. ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఇంకా చాలా విగ్రహాలు నిమజ్జనం కోసం వాహనాల్లో వేచి ఉన్నాయి. మరోవైపు నిమజ్జనం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ లో దాదాపు 40 వేల మంది పోలీసులను మోహరించారు. నిమజ్జనం సాఫీగా సాగేలా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకున్నారు. నిమజ్జనం సందర్భంగా ఓ చోట భక్తులతో కలిసి మహిళా పోలీసులు డ్యాన్స్ చేయడం ఆకట్టుకుంది. డీజే పాటలకు అనుగుణంగా ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు భక్తులతో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను బీఆర్ఎస్ నాయకురాలు సామల హేమ ట్విట్టర్ లో షేర్ చేశారు. హైదరాబాద్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ఇదే నిదర్శనం అని పేర్కొన్నారు.

Latest Articles

కేరళం సీఎం సస్పెన్స్‌కు తెర.. వీడీ సతీశన్ పేరును ప్రకటించిన అధిష్టానం

కేరళ ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. మాజీ ప్రతిపక్ష నేత, 61 ఏళ్ల వీడీ సతీశన్‌ను కాంగ్రెస్ పార్టీ కేరళ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. సీఎం రేసులో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్