కేరళలో మాజీ సీఎం కుమారుడి విజయకేతనం..!

స్వతంత్ర వెబ్ డెస్క్: కేరళ మాజీ సీఎం, దివంగత కాంగ్రెస్ నేత ఊమెన్ చాందీ కుమారుడు, చాందీ ఊమెన్  పుత్తుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి 36,454 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  చాందీ ఊమెన్ కు మొత్తం 78,098 ఓట్లు పోలయ్యాయి. సీపీఎం అభ్యర్థి థామస్ కు 41,644 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి లిగిన్ లాల్ 6,447 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. పుత్తుపల్లి స్థానంలో చాందీ ఊమెన్ మెజారిటీ పరంగా కొత్త రికార్డు నమోదు చేశారు. ఈ నియోజకవర్గ చరిత్రలో ఇంత అత్యధిక మెజారిటీతో గెలిచిన నేతగా చాందీ ఊమెన్ నిలిచారు. 2011లో తన తండ్రి చాందీ ఊమెన్ సాధించిన 33,000 ఓట్ల మెజారిటీని అధిగమించారు.

ఈ ఫలితాలపై కేరళకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ స్పందిస్తూ.. ‘‘ఈ ఫలితాలు ఊహించినవే. ఎందుకంటే పుత్తుపల్లి ప్రజలు వారిని (అధికార పార్టీ) శిక్షించేందుకు వేచి చూశారు. తాము చేసిన దానికి సీపీఎం రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. పుత్తుపల్లి ప్రజలు బీజేపీ, సీపీఎంను విసిరికొట్టారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల వ్యాఖ్యానించారు.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్