స్వతంత్ర వెబ్ డెస్క్: నెల ఒకటో తేదీనే వంట గ్యాస్ వినియోగదారులకు షాక్ తగిలింది. 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ రేటు భారీగా పెరిగింది. ఈ సిలిండర్ ధర ఏకంగా రూ. 209 మేర పెంచుతూ ఆయిల్ మార్కెంటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంపు తక్షణమే అమల్లోకి వచ్చింది. అయితే గృహోపయోగాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట కలిగించాయి. కానీ, పండుగ సీజన్ ముంగిట వాణిజ్య సిలిండర్ ధరలు పెరగడం అందరిపై ప్రభావం పడనుంది. తాజా పెంపు తర్వాత ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 1731.50కి చేరింది. కోల్‌కతాలో రూ. 1839కి చేరగా.. హైదరాబాద్‌లో ఏకంగా రూ. 1956.50కు చేరుకుంది. విజయవాడలో 19 కేజీల వాణిజ్య సిలిండర్ రేటు రూ.1888.50గా ఉంది..
గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. ఒకటో తేదీ షాక్
0
243
Latest Articles
హెలో స్పేస్.. విక్రమ్ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్ ప్రయోగం
భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరో స్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -
- Advertisement -


