స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గందరగోళంగా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు సభలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేస్తున్నారు. సభలో నినాదాలు చేస్తూ ఆందోళన తెలుపుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సభలో విజిల్ వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభ గందరగోళంగా మారింది. ఓవైపు అధికార పక్షం ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ అడ్డుకుంటున్నారు.
స్పీకర్ పలుమార్లు హెచ్చరించినా ఎమ్మెల్యేలు వినిపించుకోలేదు. చంద్రబాబు అరెస్టుపై సభలో చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. ఈ ఆందోళనను సెల్ ఫోన్ లో వీడియో తీయడంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వినిపించుకోక పోవడంతో టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్ లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సెషన్ మొత్తానికి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు.