శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్న కన్నడ భక్తులు

     శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఈనెల 6 నుండి 10 వరకు వైభవంగా జరగనున్నాయి. ఈనేపథ్యంలో దేవాదిదేవుడిని తనివితీరా దర్శించుకునేందుకు నల్లమల అడవి మార్గం గుండా కాలి నడకన పాదయాత్రగా కన్నడ భక్తులు తరలివస్తున్నారు. నల్లమల అంత ఓంకార నాదంతో ప్రతిధ్వని స్తోంది. ఉగాది పర్వదినం సమీపిస్తుండ టంతో..శ్రీగిరి మల్లయ్య, ధ్యాన మల్లన్న తండ్రి అదుకో అంటూ ఆర్తితో పిలుస్తూ చేరుకుంటున్నారు. నల్లమల అరణ్యం గుండా కాలినడకన వస్తున్న వారికి దేవస్థానం పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించింది.

    నల్లమల బాటలన్నీ మల్లన్న సన్నిధి వైపే సాగుతుండా..కన్నడ భక్తుల భజనలతో నల్లమల మార్మోగుతోంది. ఇక ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురం గ్రామం వద్ద భక్తుల కోసం మంచినీటి సౌక ర్యం కల్పించారు. అడవి మార్గంలో రాళ్లు రప్పలు లేకుండా కాలినడకన వచ్చే భక్తుల కోసం దారివెంట ట్రాక్టర్లతో నీళ్లు చల్లడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఇంకా మార్గమధ్యలో దేవస్థానం సహకారంతో స్వచ్ఛంద సేవాకర్తలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ కోసం ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలు కూడా బాగున్నాయన్నారు భక్తులు. ఇక కన్నడ భక్తులు శ్రీశైలం శ్రీభ్రమరాంబికాదేవిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తుంటారు. ఆమెను తనివితీరా చూసేందుకు ఎండను సైతం లెక్కచేయ కుండా ఎంతో భక్తి శ్రద్ధలతో.. వెంకటాపురం నుండి దట్టమైన అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల కొద్దీ నడుచు కుంటూ వస్తుంటారు. భక్తుల సౌకర్యాలపై దేవస్థానం ఈవో పెద్దిరాజు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం తమకు ఎంతో సంతోషంగా ఉందంటున్నారు.

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్