స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో నిర్వహించ తలపెట్టిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలని దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ ధర్మాసనం తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో పెనుదుమారం రేపిన లీకేజీ ఘటన కారణంగా రద్దయిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ఈనెల 11న నిర్వహించనుంది. 2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనను వెలువరించింది టీఎస్‌పీఎస్సీ. ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. పేపర్ లీకేజీ కారణంతో ఈ పరీక్షను రద్దు చేసి ఈనెల 11న నిర్వహించనున్నారు.
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు హైకోర్టు నిరాకరణ
0
280
Latest Articles
ఫరియా అబ్దుల్లా డైరెక్టర్ అవుతారా?
ఫరియా అబ్దుల్లా.. ‘జాతిరత్నాలు’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. తన కామెడీ టైమింగ్, ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు నటిగా మరో అడుగు ముందుకు వేస్తూ తమిళ సినిమాల్లోకి...
- Advertisement -
- Advertisement -


