హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. శామీర్‌పేట పరిధి ఔటర్ రింగ్ రోడ్డుపై బొలేరో వాహనంలో తరలిస్తున్న 85 లక్షల విలువైన 243 కేజీల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఒడిషా నుండి మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా తరలిస్తుండగా గంజాయిని పట్టుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. అలాగే బొలేరో వాహనం 7 చరవాణిలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు డీసీపీ. అయితే,.. బాలానగర్ ఎస్‌వోటీ, శామీర్‌పేట పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఈ గంజాయి పట్టుబడింది.