లోక్‌సభ ఎన్నికల వేళ అక్రమార్కులపై ఉక్కుపాదం మోపారు అధికారులు. కార్డన్ సెర్చ్‌తో భాగ్యనగరంలో తిష్టవేసిన విదేశీయుల పని పడుతున్నారు. ఆకస్మిక తనిఖీలతో స్మగ్లర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.
లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసులు అక్రమార్కులపై ఫోకస్ పెట్టారు. విస్తృత తనిఖీలతో అణువణువు గాలిస్తున్నారు. కార్డన్ సెర్చ్‌తో విదేశీయుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే స్మగ్లింగ్‌కు అసాంఘీక కార్యక్రమాలకు హైదరాబాద్‌ను అడ్డగా మార్చుకుని దందా సాగిస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు భాగ్యనగర పోలీసులు. ఈ నేపథ్యంలోనే నైజీరియన్లపై నజర్ పెట్టారు అధికారులు.
పార్లమెంట్ ఎన్నికల వేళ శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. రాచకొండ కమీషనరేట్ పరిధిలోని రంగారెడ్డి పోలీసులు కార్డెన్ సెర్చ్ చేపట్టారు. రంగంలోకి దిగిన సీఐలు, ఎస్సైలు పాతన నేరస్తులు, రౌడీషీటర్ల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. అనుమానిత ప్రాంతాల్లో అనువణువు గాలిస్తున్నారు. మద్యం, నాటు సారా, గుట్కా విక్రయ స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇక ఈ క్రమంలోనే వీసా గడువు ముగిసినా సన్ సిటీ అడ్డాగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్స్‌పై పోలీసుల నజర్ పడింది. రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సన్ సిటీ, హైదర్ షాకోట్ ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. నైజీరియన్స్ ఉంటున్న ఇండ్లలో కొనసాగుతున్న సోదాలు చేశారు. వారి వీసాను పరిశీలించిన పోలీసులు.. గడువు ముగిసినా అక్రమంగా రాష్ట్రంలో ఉంటున్నట్టు గుర్తించారు. వీరి వద్ద డ్రగ్స్ ఉన్నాయా లేవా అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. తెల్లవారుజాము 5 గంటల నుంచి కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
సన్ సిటీ అడ్డాగా కొన్నాళ్లుగా డ్రగ్స్ దందా సాగిస్తున్నారు నైజీరియన్లు. గతంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ నైజీరియన్లు అనేకసార్లు పట్టుబడటంతో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఇక సోదాల్లో భాగంగా ఓ అపార్ట్మెంట్లో తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లారు పోలీసులు. అపార్ట్మెంట్లోని ప్లాట్లో ఉంటున్న నైజీరియా కు చెందిన ఇద్దరు అక్క చెల్లెల వద్ద నుండి పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగుతోంది. ఎన్నికల వేళ శాంతి భద్రతలపై దృష్టి సారించారు పోలీసులు. ఒక్క భాగ్యనగరమే కాదు.. తెలంగాణ వ్యాప్తంగా ముమ్మర తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్మంగా డ్రగ్స్ దందాపై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేసి డేగకన్నుతో అక్రమార్కుల అంతు చూసే పనిలో పడ్డారు.


