తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పటిషన్ వేసింది. ఈ అంశంపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కోర్టుకు తీసుకెళ్లారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో అనర్హత వేటు వేయాలన్న సుప్రీంకోర్టు తీర్పులను స్పీకర్ అమలు చేయడం లేదని ఆరోపించారు. వాదనల అనంతరం కేసు విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది హైకోర్టు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల పై విచారణ వాయిదా
0
212
Previous article
Latest Articles
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న సీనియర్ల అసంతృప్తి
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతల నుంచే తీవ్ర స్థాయి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ప్రతిపక్షాల విమర్శలను దీటుగా ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి, అంతర్గతంగా సీనియర్ నాయకుల అసంతృప్తి వ్యవహారం పెద్ద...
- Advertisement -
- Advertisement -


