28.2 C
Hyderabad
Wednesday, December 10, 2025
spot_img

 ALERT: ఇది విన్నారా.. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడిపితే 20 వేలు ఫైన్

స్వంతత్ర వెబ్ డెస్క్:  చెవులకు హెడ్ ఫోన్స్ తగిలించుకుని ఫోన్ మాట్లాడుతూనో, పాటలు వింటూనో వాహనం నడిపారంటే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ తో మోతమోగిస్తారు.  వందా రెండొందలు కాదు.. ఏకంగా రూ.20 వేలు వసూలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 1 నుంచి ఈ రూల్ అమలులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బైక్, స్కూటీల మీద వెళుతున్నపుడు మాత్రమే కాదు ఆటోలు, కార్లు.. వాహనం ఏదైనా సరే హెడ్ ఫోన్స్ పెట్టుకుని నడిపితే జరిమానా తప్పదని అధికారులు స్పష్టం చేశారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. వెనక వస్తున్న వాహనాలు హారన్ కొట్టినా వినిపించదని, ఓవర్ టేక్ చేసే సమయాల్లో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని వివరించింది.

రోడ్డు ప్రమాదాలను నివారించే క్రమంలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని వాహనం నడపడాన్ని నిషేధించినట్లు వెల్లడించింది. వాహనం నడిపేటపుడు ఇయర్ ఫోన్స్, హెడ్ సెట్ పెట్టుకుంటే భారీగా ఫైన్ విధించాలని నిర్ణయించింది. ఇలా పట్టుబడ్డ వాహనదారులకు రూ.20 వేలు జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఆగస్టు 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం వివరించింది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్