కాంగ్రెస్‌కి చెంపపెట్టు అంటూ పార్టీ ఫిరాయింపు విచారణలో హైకోర్టు తీర్పుపై స్పందించారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ కీలక నేత హరీష్‌రావు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న ఆయన.. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టు అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమని…త్వరలోనే ఉప ఎన్నికలు రావడం ఖాయమంటూ రాసుకొచ్చారు హరీష్‌రావు. అలాగే ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నేతలు గెలవడం తథ్యమంటూ జోష్యం చెప్పారు. ఇక ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా హైకోర్టు తీర్పుపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. రాష్ట్ర శాసనసభాపతి నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని ఆశిస్తున్నామన్నారు.