సీఎం రేవంత్‌కి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్.. రోడ్ల విస్తరణకు సహకారం అందించాలని కిషన్‌రెడ్డి లేఖలో తెలిపారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వస్తారని.. వీలైనంత త్వరగా రోడ్లను పూర్తిచేయాలని కిషన్‌రెడ్డి కోరారు.
మరోవైపు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, చర్లపల్లి టెర్మినల్.. రోడ్ల విస్తరణకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 700కోట్ల వ్యయంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. నిర్మాణ పనులు 2026 నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యమని చెప్పుకొచ్చారు.