ట్విటర్ వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం

మాట తప్పడం… మడమ తిప్పడం… ఇదేనా కాంగ్రెస్ మార్కు పాలన… అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు. పథకాల అమలులో ఎన్ని సార్లు మాట మార్చుతారని మండిపడ్డారు. ఎన్ని సార్లు ప్రజలను మోసం చేస్తారని ఆక్షేపించారు. డిసెంబర్ 9 2023న రుణమాఫీ చేస్తామని చెప్పి… ఆగస్టు 15లోపు చేస్తామని మరోసారి చెప్పి దసరా వరకు చేశారన్నారు. నేటికీ 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ అందలేదన్నారు. రైతు బంధు ఇప్పుడు తీసుకుంటే 10 వేలు డిసెంబర్ 9 తర్వాత తీసుకుంటే 15 వేలు అని ప్రచారం చేసి… వానాకాలం ఎగ్గొట్టారని ఆక్షేపించారు.

యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామని… మాట మార్చి జనవరి 26 అన్నారని తెలిపారు. ఇప్పుడు మరోసారి మార్చి 31 వరకు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతు బంధు ఇచ్చి రైతన్నకు దన్నుగా నిలిస్తే… దాన్ని ఎగ్గొట్టి రైతులకు భరోసా లేకుండా రేవంత్ చేశాడని విమర్శించారు. ఆసరా 4 వేలు, తులం బంగారం, మహిళలకి 2 వేల 500, విద్యా భరోసా కార్డు, ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇవన్నీ ఇందిరమ్మ రాజ్యంలో ఏమయ్యాయో ఆ ఇందిరమ్మకే తెలియాలంటూ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు.

Latest Articles

జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్