వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్టానికి పెట్టుబడులు రాలేదని మంత్రి నారా లోకేష్ విమర్శించారు. పరువునష్టం కేసులో విశాఖ కోర్టుకు ఆయన హాజరయ్యారు. ఈ కేసు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది కోర్టు. గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల్లో ఎన్ని కంపెనీలు వచ్చాయని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ లేకుండా పెట్టుబడులు ఎలా వస్తాయన్నారు. కియా మోటర్స్‌కు చంద్రబాబు ప్రయత్నిస్తే.. వైసీపీ వారు క్రెడిట్‌లో వేసుకున్నారని విమర్శించారు. వైసీపీ మూడు రాజధానుల గేమ్‌తో రాష్ట్రం నష్టపోయిందన్నారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై ఒకేసారి దర్యాప్తుకు ఆదేశించలేమన్నారు. యువగళం పాదయాత్రలో వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు.