స్వతంత్ర, వెబ్ డెస్క్: దేశంలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది.ఏ విధంగా డబ్బులను లాగేసుకుంటారో తెలియడం లేదు. వీళ్ళ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తుల, సంస్థల సోషల్ మీడియా పేజీలను హ్యాక్ చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. హైదరాబాద్‌లో తాజాగా హ్యాకింగ్ వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈసారి హ్యాకర్లు ఏకంగా పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను టార్గెట్ చేశారు. పోలీస్ డిపార్ట్‌మెంట్ ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేశారు. ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ ఫేస్‌బుక్ పేజీని హ్యాకింగ్ చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పోలీస్ స్టేషన్ అధికారిక పేజీలో బూతు వీడియోలను అప్‌లోడ్ చేశారు సైబర్ నేరగాళ్లు. విదేశాలకు చెందిన కొందరు మహిళలకు సంబంధించిన బూతూ వీడియోలను ఈ పేజీలో అప్‌లోడ్ చేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన డిపార్ట్‌మెంట్ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పటికే పేజీలో వీడియోలు డిలీట్ కాకపోవడం గమనార్హం. ఇంతకీ ఈ వీడియోలను ఎవరు అప్‌లోడ్ చేశారు.? హ్యాకింగ్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో విచారణ జరుగుతోంది. బుధవారం అర్థ రాత్రి తర్వాత ఫేస్‌బుక్ పేజీ హ్యాక్‌కి గురైనట్లు అధికారులు గుర్తించారు.