తెలంగాణ ప్రభుత్వ వైఖరితో గ్రూప్ వన్ అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభ్యర్థులు తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుకుని ప్రిపేర్ అయ్యారని తెలిపారు. బలహీన వర్గాలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని ఆరోపించారు. జీవో 29పై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. జీవో నెంబర్ 55 ప్రకారం గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని కేటీఆర్ చెప్పారు.