స్వతంత్ర, వెబ్ డెస్క్: తెలంగాణలో రేపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనుంది టీఎస్పీఎస్సీ. ఉదయం 10: 30 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 పోస్ట్ కు 3 లక్షల 80 వేల 72 మంది(380072) అప్లై చేశారు. ఇప్పటివరకు 3 లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేశారు. మార్చ్ లో వెలుగులోకి వచ్చిన పేపర్ లీక్ తో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దయింది. ఈ సారి కూడా ఆబ్జెక్టివ్ పద్ధతిలోనే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను నిర్వహించనున్నారు. పరీక్షా పేపర్ లీక్ కాకముందు 286051 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. రేపటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కు అభ్యర్థులు పెరిగారు. రాష్ట్ర వ్యాప్తంగా 994 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.