స్వతంత్ర, వెబ్ డెస్క్: సత్తెనపల్లిలో నన్ను ఓడించటానికి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు నైనా రమ్మనండి తెల్చుకుంటా.. కన్నా అనే వస్తాదును పంపి నన్ను ఓడించడానికి చూస్తున్నారని అన్నారు. కన్నా ఉడత ఊపులకు భయపడే రకం తాను కాదని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి శిష్యుడినని తెలిపారు. తాను రంగంలో ఉండి ఉంటే వైఎస్ కేబినెట్‌లో కన్నా మంత్రిగా ఉండేవాడే కాదన్నారు. సత్తెనపల్లిలో మా టీమ్ దెబ్బ ఎలా ఉంటుందో కన్నాకు రుచి చూపిస్తానన్నారు.