ప్రముఖ సినీనటి, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా విశాఖపట్నంలో సందడి చేసింది. బీచ్ రోడ్డులోని ఓ హోటల్‌లో ఫ్యాషన్ టూర్ పేరుతో ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌డీసీఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తమన్నా వేదికపై కొద్దిసేపు ర్యాంప్ వాక్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఒకే వేదికపై నిర్వహించిన ఫ్యాషన్, సంగీతం, అందాల పోటీల ప్రదర్శన ఆహూతులను అలరించింది. ఫ్యాషన్, టెక్నాలజీ, వినోదాన్ని మిళితం చేసి బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ వైభవోపేతంగా జరిగింది. ఈ ఫ్యాషన్ టూర్ ఈ నెల 23న గౌహతిలో జరుగనుంది.
వైజాగ్‌లో మిల్కీ బ్యూటీ సందడి
0
268
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


