షబ్బీర్‌ అలీకి గ్రీన్ సిగ్నల్.. ఎల్లారెడ్డి నుంచి ఇద్దరి పేర్ల పరిశీలన..!

స్వతంత్ర వెబ్ డెస్క్: కాంగ్రెస్‌ పార్టీ(Congress) అభ్యర్థుల ఖరారు ప్రక్రియ కొనసాగుతోంది. పార్టీ నాయకత్వం దరఖాస్తులను వడపోసి, ఒక్కో నియోజకవర్గంనుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లతో జాబితాను రూపొందించింది. కామారెడ్డి నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ(Shabbir Ali) పేరు ఖరారు చేసినట్లు తెలిసింది.
ఎల్లారెడ్డి నుంచి నలుగురు దరఖాస్తు చేసుకోగా.. వాటిని పరిశీలించిన పీసీసీ ఎన్నికల కమిటీ.. పీసీసీ ప్రధాన కార్యదర్శి సుభాష్‌రెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మదన్‌మోహన్‌రావుల పేర్లను సిఫారసు చేసింది. జుక్కల్‌ నుంచి ఎనిమిది మంది దరఖాస్తు చేసుకోగా ముగ్గురి పేర్లను ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే సౌదాగర్‌ గంగారాం, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్‌తో పాటు తోట లక్ష్మీకాంత్‌రావ్‌ల పేర్లు జాబితాలో ఉన్నాయి.
బాన్సువాడ(Bansuwada) నియోజకవర్గం టికెట్టు కోసం 16 మంది దరఖాస్తు చేసుకోగా.. నియోజకవర్గ ఇన్‌చార్జి కాసుల బాల్‌రాజు పేరుతో పాటు మరో ఇద్దరి పేర్లను ఎంపిక చేశారు. వారి వివరాలు తెలియరాలేదు. ఈ జాబితాను స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలించిన అనంతరం పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపిస్తారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Latest Articles

నీట్‌ పేపర్‌ లీక్‌ కేసులో 13మందిని జైలుకు పంపాం-కిరణ్‌ రిజిజు

దేశ వ్యాప్తంగా నీట్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ కేసులపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు నీట్‌ పేపర్‌ లీకేజీపై స్పందించారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్