మూసీ ప్రాజెక్ట్‌పై తాము అడిగిన ప్రశ్నలను ప్రభుత్వం దాటవేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. 4వేల 100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం అడిగిందన్నారు. ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం ఆశ్రయించిన విషయం వాస్తవమా కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. డీపీఆర్ తయారు కాలేదని ప్రభుత్వం ఇవాళ సభకు చెప్పిందన్నారు. ప్రజలకు పునరావాసం కల్పించిన తరువాత ప్రాజెక్ట్ పనులు ప్రారంభించాలని సూచించారు. మూసీ సుందరికరణకు పేదల ఇల్లు పోతాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపేశారన్నారు. మూసీ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని చెప్పారు. మూసీ పరివాహక ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు.