205 మంది భారతీయులతో బయల్దేరిన అమెరికా మిలిటరీ విమానం పంజాబ్‌లోని అమృత్ సర్ చేరుకుంది. అక్రమ వలసదారులను ఏరివేతే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన మిషన్‌లో భాగంగా మిలిటరీ విమానం కాసేపటి క్రితం అమృత్ సర్‌లో ల్యాండ్ అయింది.
డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే ఆ దేశంలో అక్రమంగా ఉన్న భారతీయులను వెనక్కు పంపిస్తున్నారు. చట్ట వ్యతిరేకంగా అమెరికాలో అడుగుపెట్టిన వారిని గుర్తించి ప్రత్యేక విమానంలో స్వదేశాలకు పంపిస్తున్నారు. 205 మందితో టెక్సాస్‌లో బయల్దేరిన విమానం .. బుధవారం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయింది.