విద్యార్థులకు శుభవార్త.. ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు జమ..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా దీవెన పథకం(Jagananna Vidya Devena Scheme) నిధులను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యా దీవెన మూడో త్రైమాసిక నిధులను సీఎం జగన్.. ఈ నెల 28వ తేదీన చిత్తూరు జిల్లా నగరిలో(Nagari) బటన్ నొక్కి నేరుగా విడుదల చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా… ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ , ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు మొత్తం ఫీజులను తిరిగి చెల్లిస్తారు.
పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఐటీఐ, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులకు ఫీజులు, వసతి, ఇతర ఖర్చుల కోసం ప్రభుత్వం చెల్లిస్తోంది. కుటుంబంలో ఎంత మంది చదువుతూ ఉన్నా.. అందరూ అర్హులే… ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు,… డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ వంటి కోర్సులు చేసే విద్యార్థులకు రూ.20 వేల చొప్పున ప్రతి యేటా.. 2 వాయిదాలలో చెల్లిస్తోంది.

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్