28.2 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

ఉద్యోగులకు భారీ షాకిచ్చిన గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్

  • దాదాపు 3 వేల 200 మంది ఉద్యోగుల తొలగింపు
  • అస్థిరమైన గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల ఫలితంగా ..
  • కార్పొరేట్ డీల్స్‌లో భారీ మందగమనం
  • కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ
  • కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగుల తొలగింపు

దిగ్గజ అంతర్జాతీయ సంస్థల్లో ఆర్ధిక మాంద్యం భయాలు ఇప్పట్లో పోయేలా లేవు. గతేడాది మే నుంచి మొదలైన రెసిషన్‌ భయాలు పలు సంస్థల్ని ఇంకా పట్టి పీడుస్తూనే ఉన్నాయి. అందుకే నెలలు గడిచే కొద్ది ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కొన్ని కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించే విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా న్యూయార్క్‌కు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఈ వారంలో దాదాపు 3 వేల 200 మంది ఉద్యోగుల్ని ఫైర్‌ చేయనుంది.

గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల అస్థిరత ఫలితంగా కార్పొరేట్ డీల్స్‌లో భారీ మందగమనం ఏర్పడింది. ఫలితంగా ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కాస్ట్‌ కటింగ్‌ పేరుతో ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేయనున్నట్లు బ్లూమ్‌ బెర్గ్‌ నివేదిక వెలుగులోకి వచ్చింది. అయితే ఉద్యోగులపై గోల్డ్‌మన్‌ సాక్స్ యాజమాన్యం స్పందించింది. లేఆఫ్స్‌ ఉంటాయని ప్రకటిస్తూనే ఎంతమంది అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. కాగా సంస్థలోని కోర్ ట్రేడింగ్, బ్యాంకింగ్ యూనిట్ల నుంచి ఉద్యోగులను తొలగించనున్నట్లు గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ ప్రకటించింది.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్