గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న నాటు-నాటు పాట ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారిపోయింది. బెస్ట్ సాంగ్ క్యాటగిరీలో ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు…నాటు…పాట నామినేట్ అయి, అవార్డు సొంతం చేసుకోవడంతో అవడంతో సినీ అభిమానులు అందరూ ఫుల్ ఖుష్ గా ఉన్నారు. ఈ పాట సంగీత దర్శకుడు కీరవాణి అవార్డు తీసుకున్నారు.
ఈపాటకు సంబంధించి రాజమౌళి ఏమంటున్నారంటే, నాకెందుకో సినిమా డ్రైగా నడుస్తున్నట్టుగా అనిపించింది. ప్రేక్షకుల్లో హుషార్ తెప్పించాలంటే, ఇక్కడొక ఊపు సాంగ్ ఉండాలని భావించాను. అందుకోసం కథకు అనుగుణంగా ఒక సీన్ రాశాను. అలా ఇద్దరు హీరోలని, ఒక పార్టీకి వచ్చేలా ప్లాన్ చేసి, స్క్రిప్ట్ రాశాను. అలా అక్కడ పాటని కూర్చోబెట్టి…సాహిత్యం రెడీ అయిన తర్వాత సాంగ్ కంపోజిషన్ చేశాం.
హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ బ్రహ్మాండమైన డ్యాన్సర్లు…వారిద్దరి స్టెప్స్ ఒకే స్టయిల్ లో సింక్ అవాలనే ఉద్దేశంతో 15 టేక్స్ తీశానని అన్నారు. ఇక పాట పూర్తయ్యేసరికి డ్యాన్సర్లందరూ అలిసిపోయారని అన్నారు. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్…ప్రాణం పెట్టి చేశాడు. ఈ పాట కంపోజిషన్ కోసం సుమారు 100 సిగ్నేచర్స్ ఇచ్చాడు. వాటిలో ఇప్పుడున్నది సెలక్ట్ చేశామని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ పలు సందర్భాల్లో మా ఇద్దరి హుక్ స్టెప్ లో కాలు ఎడమకి, కుడికి, ముందుకి, వెనక్కి చేసేది… కరెక్టుగా సింక్ అవుతున్నాయా? లేదా ? అని జక్కన్న మోనిటర్ లో చూస్తూ నానా పాట్లు పెట్టాడని నవ్వుతూ చెబుతుంటారు. ఈ విషయంలో రాజమౌళి నరకం చూపించారని కూడా చెబుతుంటారు. కానీ పాటకి ఇంత స్పందన వచ్చాక, జక్కన్న విజన్ మాకు అర్థమైందని అంటూంటారు. అంతేకాదు జక్కన్న ఒక టాస్క్ మాస్టర్. అందుకనే భారతదేశం గర్వించతగ్గ దర్శకుడయ్యాడని అంటారు.
ఈ పాట ఆస్కార్ నామినేషన్ లో కూడా ఉంది. అక్కడ కూడా అవార్డు తీసుకుంటే దాని కిక్కే వేరుగా ఉంటుందని అభిమానులు అంటున్నారు. యూట్యూబ్ సైతం ఈ పాటను చూసి మెచ్చుకుంది. 0.5 ఎక్స్ స్పీడుతో చూసినా…వారిద్దరే వేగంగా చేశారని కామెంట్ చేసింది. అందుకు నిర్మాణ సంస్థ సమాధానం ఇచ్చింది. మేం కూడా 0.2 ఎక్స్ స్పీడ్ తో ఎడిట్ చేయాలని అనుకున్నాం. మా ఇద్దరి హీరోలు ఆ అవకాశం ఇవ్వకుండా ఇరగ్గొట్టారని తెలిపారు.
యూట్యూబ్ లో పాట విడుదలైన 24 గంటల్లో 10.4 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. సౌత్ ఇండియాలో ఫస్ట్ సినిమాగా కేక పుట్టించింది. ఇక 48 గంటల్లో 2 కోట్లకు పైగా వ్యూస్ సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఇక పాట విడుదలైన వెంటనే స్పూఫ్స్, రీమిక్స్ లకైతే లెక్కే లేదు. చిన్నారుల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు, ఆడవాళ్లు, మగవాళ్లని తేడాలేకుండా రాంచరణ్, ఎన్టీఆర్ స్టెప్పులను ఇరగదీసి వదిలేశారు. ఇలా పాట విడుదలైన దగ్గర నుంచి సంచలనాలతో దూసుకుపోతూ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో క్రేజ్ మరింత పెరిగింది.