29.7 C
Hyderabad
Thursday, April 18, 2024
spot_img

‘ఓం భీమ్ బుష్‌’కు గ్యాంగ్స్‌తో వెళ్ళండి.. నవ్వుకొని వస్తారు: శ్రీవిష్ణు

హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన అవుట్ అండ్ అవుట్- ఎంటర్‌టైనర్ ‘ఓం భీమ్ బుష్’ . వి సెల్యులాయిడ్, సునీల్ బలుసు కలిసి ఈ సినిమాని నిర్మించగా, యువి క్రియేషన్స్ సమర్పించింది. మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల ‘ఓం భీమ్ బుష్’ అన్ని వర్గాల ప్రేక్షకులని హిలేరియస్ గా అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు మారుతి ఈ వేడుకలో ముఖ్య అతిధులుగా ఈ వేడుకలో పాల్గొన్నారు. యంగ్ డైరెక్టర్ రామ్ అబ్బరాజు, హసిత్ గోలి, పవన్ సాదినేని తదితరలు హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.

సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. నో లాజిక్.. ఓన్లీ మ్యాజిక్.. ఈ ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం వుండాలి. ఆ ట్యాగ్ లైనే ‘ఓం భీమ్ బుష్’. హర్ష రౌడీ బాయ్స్ చేసినప్పుడే కొత్త కథలు చేయాలని అనేవారు. నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం ఈవాళ థియేటర్స్ లో లాజిక్ లేదు ఓన్లీ మ్యాజిక్ అని నిరూపించి సమ్మర్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. థియేటర్ కి వెళితే నవ్వుకుని వస్తున్నామని ప్రేక్షకులే చెబుతున్నారు. హర్ష, శ్రీవిష్ణు టీం అందరికీ అభినందనలు. మంచి ఎంటర్ టైనర్ సినిమా ఈ సమ్మర్ కి వచ్చింది. అందరూ థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి’ అన్నారు.

డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ… ‘ఓం భీమ్ బుష్’ ప్రిమియర్ చూశాను. థియేటర్ అంతా అద్భుతంగా ఎంజాయ్ చేశారు. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ ముగ్గురి కాంబినేషన్ ని కలపడమే ఈ విజయం. ప్రేక్షకులని తప్పకుండా అలరించాలనే టెన్షన్ ఆ ముగ్గురిలో గమనించాను. చాలా గొప్పగా యాక్ట్ చేశారు. దర్శకుడు అద్భుతంగా కథ రాసుకుంటే.. ఈ ముగ్గురు ఇంకా అద్భుతంగా నటించారు. తప్పకుండా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా ఇది. చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ ని థియేటర్స్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సెలబ్రేట్ చేయండి. మీరు ఇచ్చే డబ్బులకి వందశాతం న్యాయం చేస్తుంది. వి సెల్యులాయిడ్ కి , దర్శకుడు హర్షకి, మిగతా టీం అందరికీ అభినందలు’ తెలిపారు.

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ఈ వేడుకు విచ్చేసిన నిర్మాత దిల్ రాజు గారికి, మారుతి గారికి, యువ దర్శకులకు, టీం అందరికీ ధన్యవాదాలు. ‘ఓం భీమ్ బుష్’ మంచి విజయం సాధించి అద్భుతంగా దూసుకుపోతోంది. ఈ సినిమా చాలా రోజులు ఆడుతుందని మా అందరి గట్టి నమ్మకం. ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాకి చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. అందరికీ పేరుపేరున ధన్యవాదాలు. హర్ష ఈ కథ చెప్పినప్పుడు థియేటర్స్ లో కడుపుబ్బా నవ్వించాలని నిర్ణయించుకునే ఈ సినిమా చేశాను. అది ఈ రోజు అద్భుతంగా నిరూపితమైయింది. ఈ కథ చెప్పి రాహుల్, దర్శిని కన్విన్స్ చేసి తెచ్చినప్పుడే ఈ సినిమా విజయం సాధిస్తుందని ఫిక్స్ అయ్యాను. రాహుల్, దర్శి పాత్రలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. థియేటర్స్ లో విజల్స్ పడుతున్నాయి. యూత్ తో పాటు ఫ్యామిలీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా చివరి ఇరవై నిమిషాలకు మహిళా ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వస్తోంది. సినిమా చూసిన వారంతా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. శ్రీకాంత్ చాలా అద్భుతంగా ప్రొడక్షన్ డిజైన్ చేశారు. రాజ్ తోట గారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. సన్నీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. తను మరిన్ని మంచి సినిమాలు చేయాలి. నిర్మాతలు వంశీ, సునీల్ గారు చాలా గొప్పగా ప్రోత్సహించారు. వారి నిర్మాణంలో మళ్ళీ మళ్ళీ పని చేయాలని వుంది. సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా రోజులు ఆడబోతుంది. వెంటనే గ్యాంగ్స్ తో వెళ్ళండి. ఖచ్చితంగా నవ్వుకొని వస్తారు, ఇంతలా నవ్వుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. సినిమాకి వెళ్ళండి. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అన్నారు.

రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. కష్టే ఫలి అంటారు. మా దర్శకుడు మమ్మల్ని కష్టపెట్టి ఫలితాన్ని పొందాడు. (నవ్వుతూ) కష్టం పడటంలో కూడా ఓ ఆనందంగా వుంటుంది. తెరపై మమ్మల్ని మేము చుసుకున్నపుడు మిగతా వారు అనందంగా నవ్వడం చూసి మేము ఆనందం పడుతున్నాం. సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన ప్రేక్షకులు ధన్యవాదాలు” తెలిపారు.

దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి మాట్లాడుతూ… థియేటర్స్ లో ప్రేక్షకులు సినిమా చూసి పగలబడి నవ్వుతున్నారు. వారి నవ్వులు చూసిన తర్వాత మేము రెండేళ్ళు పడిన కష్టం మర్చిపోయాం. ప్రిమియర్స్ నుంచే మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా చూసిన వారంతా చాలా అద్భుతంగా వుందని చెప్పారు. మంచి రివ్యూస్ వచ్చాయి. ఇలాంటి సినిమా గ్యాంగ్స్ తో వెళ్లి చూస్తే ఇంకా మజా వుంటుంది. తప్పకుండా థియేటర్స్ లో నే చూడండి. చాలా సున్నితమైన అంశం ఇందులో వుంది. ఇలాంటి కథని అంగీకరించాలంటే నిర్మాతలకు ధైర్యం కావాలి. ఈ కథని అంగీకరించిన వంశీ అన్నకి ధన్యవాదాలు. ఆయన ఇండియాలోనే బెస్ట్ ప్రొడ్యూసర్. ఆయన లాంటి నిర్మాతలు దొరకడం నా అదృష్టం. విష్ణు గారు కథ చెప్పినప్పటి నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆయన డబ్బింగ్ లో చేసిన కరెక్షన్స్ సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి. ఆయన కామిక్ టైమింగ్ లో విశ్వరూపం చూపించారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవల్ చేశారు. దర్శి, రాహుల్ కూడా అద్భుతంగా చేశారు. దర్శి సెకండ్ హాఫ్ లో విజ్రుభించారు. రాహుల్ త్రూ అవుట్ క్యారెక్టర్ లోనే ఉంటూ అలరించారు. ఈ సినిమాకి పని చేసిన టెక్నిషియన్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.’ తెలిపారు.

నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ..ప్రతి ఏడాది మార్చిలో ఎగ్జామ్స్ ముగిసే సమయానికి ఓ మంచి సినిమా వస్తుంటుంది. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ వచ్చింది. సినిమా చూస్తున్నపుడు బాగా నచ్చింది. చూసినంత సేపు నవ్వుతూనే వున్నాను. శ్రీవిష్ణు గారి కథల ఎంపిక చాలా బావుటుంది. సినిమా అంతా నాన్ స్టాప్ గా నవ్విస్తూనే వున్నారు. శ్రీవిష్ణు, దర్శి, రాహుల్ కలసి సినిమా ఫన్ అద్భుతంగా వుంది. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా గుర్తొచ్చి నవ్వుతున్నాను. క్లైమాక్స్ కాన్సెప్ట్ ఇప్పటివరకూ తెలుగు సినిమాలో రాలేదు. ఫ్యామిలీ అంతా కలసి ఒక పండగలా చూసే సినిమా ఇది. తప్పకుండా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్యాంగ్స్, అందరితో కలసి ఈ సినిమాని చూడండి’ అన్నారు

డైరెక్టర్ రామ్ అబ్బరాజు మాట్లాడుతూ.. దర్శకుడు హర్ష కి అభినందనలు. విష్ణు గారి కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవల్ లో వుంటుంది. సామజవరగమన కంటే మించి ఇందులో నెక్స్ట్ లెవల్ లో చేశారు. రాజ్ తోట చాలా మంచి విజువల్స్ ఇచ్చారు, సన్నీ చాలా వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నిర్మాతలకు, సినిమా యూనిట్ అందరికీ అభినందనలు’ తెలిపారు

డైరెక్టర్ హసిత్ గోలి మాట్లాడుతూ.. విష్ణు గారు ఈ సినిమాలో లంకె బిందెలు వెతికి పట్టుకుంటుంటారు. ఆయన కెరీర్ లో చాలా లంకె బిందెలు వెతికి పట్టుకున్నారు. ఇదొక లంకె బిందె. సినిమా చూసిననప్పుడు ప్రేక్షకులు పడిపడి నవ్వతున్నారు. ఇలాంటి సినిమా తీయాలంటే కొంచెం క్రేజీనెస్ వుండాలి. దర్శకుడు హర్షలో ఆ క్రేజీ నెస్ కనిపించింది. ఈ సినిమాని చాలా ఆస్వాదిస్తూ తీశారని అనిపించింది. వంశీ, సునీల్ గారు సమ్మర్ కి మొదటి హిట్ ఇచ్చారు. సినిమా బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది’’ అన్నారు

దర్శకుడు పవన్ సాధినేని మాట్లాడుతూ.. సినిమాకి థియేటర్స్ లో క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. సమ్మర్ లో ఫుల్ లెంత్ ఎంటర్ టైనర్. చాలా రోజుల తర్వాత థియేటర్స్ లో ప్రేక్షకులు గట్టిగా నవ్వుకోవడం చూసి చాలా ఆనందంగా వుంది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన చిత్ర యూనిట్ కి అభినందనలు. సినిమాకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. శ్రీ విష్ణు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకోవడం ఆనందంగా వుంది. తాప్పకుండా అందరూ థియేటర్స్ కి వెళ్లి చూడండి. ఖచ్చితంగా నేజయ్ చేస్తారు’’ అన్నారు

దర్శకుడు హుస్సేన్ మాట్లాడుతూ.. సినిమా ప్రేక్షకులు చాలా గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారు. చివరి ఇరవై నిమిషాల్లో చాలా సున్నితమైన అంశాన్ని చాలా అద్భుతంగా చెప్పారు. టీం అంతా అద్భుతమైన పనితీరు కనిబరిచింది. సినిమా యూనిట్ అందరికీ అభినందనలు’ తెలిపారు. యూనిట్ సభ్యులంతా పాల్గొన్నా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది.

Latest Articles

చియాన్ విక్ర‌మ్ 62వ చిత్రం ‘వీర ధీర శూరన్’ టైటిల్ టీజర్ రిలీజ్

విలక్ష‌ణ‌మైన సినిమాలు, వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌టమే కాకుండా జాతీయ ఉత్త‌మ న‌టుడిగానూ త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న యాక్ట‌ర్ చియాన్ విక్ర‌మ్‌. బుధ‌వారం ఆయ‌న పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ ఆయ‌న క‌థానాయ‌కుడిగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్