GHMC |హైదరాబాద్ నగర పరిధిలో కుక్కల బెడదపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి ఫోన్లు మీద ఫోన్లు వస్తున్నాయి. కేవలం 36గంటల్లోనే జీహెచ్ఎంసి హెల్ప్ లైన్ నంబర్లకు 15వేల ఫిర్యాదులు అందాయి. ఇంత పెద్ద స్థాయిలో ఫిర్యాదులు వస్తుండడంతో కుక్కల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా ప్రాంతాల్లో తక్షణ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మరోవైపు వీధి కుక్కల దాడుల నేపథ్యంలో GHMC అప్రమత్తమైంది. కుక్కల దాడుల నివారణపై ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. కుక్కలు దాడులు చేస్తే తీసుకోవాల్సిన నివారణ, భద్రతా చర్యలపై పలు సూచనలు చేశారు. కాగా ఇటీవలే అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన సంగతి తెలిసిందే.
GHMC | వామ్మో.. కుక్కల బెడదపై ఇన్ని వేల ఫిర్యాదులా?
0
502
Latest Articles
తెలంగాణలో రసవత్తరంగా ఆస్తుల ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రం వచ్చి పన్నెండేళ్లు అవుతున్న సందర్భంగా మన రాజకీయ నాయకులు ఎంతగా అభివృద్ధి చెందారో ఇప్పుడు ప్రజలకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతోంది. రాష్ట్రం ఏమో కానీ నాయకుల భూబ్యాంకులు మాత్రం ఎకాయెకిన...
- Advertisement -
- Advertisement -


