NTR-BUNNY Funny Conversation| స్టార్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరు తమ సంభాషణలో వాడిన బావ అనే పదం ప్రస్తుతం ట్విట్టర్ ట్రెండింగ్ లోకి వచ్చింది. శనివారం అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే బావ.. ఈ సంవత్సరం నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా’ అంటూ ఎన్టీఆర్ ట్విట్టర్ లో విష్ చేశాడు. దీంతో ‘థ్యాంక్యూ బావ.. నీకు హగ్స్’ అంటూ బన్నీ రిప్లై ఇచ్చాడు. వెంటనే ఎన్టీఆర్ స్పందిస్తూ ‘ఓన్లీ హగ్సేనా.. పార్టీ లేదా పుష్ప’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దీనికి ‘వస్తున్నా బావ’ అంటూ బన్నీ సమాధానమిచ్చాడు. తమ హీరోలు ఇలా సరదాగా వారి సినిమాల్లోని మాటలను ట్వీట్స్ చేసుకోవడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప2’ మూవీలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొరటాల ప్రాజెక్టులో బిజీగా ఉన్నాడు.
‘పార్టీ లేదా పుష్ప’ అంటూ తారక్ ట్వీట్.. ‘వస్తున్నా’ అని బన్నీ రిప్లై
0
363
Previous article
Latest Articles
మద్యం మత్తులో బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం చింతకుంటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివారులోని ఓ బావిలో పడి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. పల్నాడు జిల్లా వినుకొండ గ్రామానికి చెందిన...
- Advertisement -
- Advertisement -


