నేడు సంగారెడ్డి జిల్లాలో మాజీ సీఎం కేసీఆర్ పర్యటన

  పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ స్పీడ్ పెంచింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్‌పూర్‌లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు లక్షమందికి పైగా ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి జనసమీకరణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు.

  సుల్తాన్‌పూర్‌లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసీఆర్‌ ప్రసంగించ నున్న నేపథ్యంలో భారీ వేదికను తీర్చిదిద్దారు. సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ప్రారంభం కానుంది. కేసీఆర్‌ హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో పటాన్‌చెరు, సంగారెడ్డి మీదుగా సుల్తాన్‌పూర్‌ చేరుకుంటారు.కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ ప్రధాన రహదారులు, కూడళ్ల్ల వద్ద బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి, గులాబీ జెండాలతో అలంకరించారు. బహిరం గసభ ప్రాంతంలో కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావు, మెదక్‌, జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ కటౌట్లను సైతం ఏర్పాటుచేశారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సంగా రెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జహీరా బాద్‌, అందోలు, నారాయణఖేడ్‌ అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. సభ నిర్వహించ నున్న స్థలాన్ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌తో కలిసి పరిశీలించారు.

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్