తెలంగాణ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్ (63)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కేరళ కొచ్చిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు, తెలంగాణ హైకోర్టుకు తొలి చీఫ్ జస్టిస్ గానూ విధులు నిర్వర్తించారు. సొంత రాష్ట్రమైన కేరళ హైకోర్టు జడ్జిగా 2004 నుంచి 20017 వరకు సుదీర్ఘకాలం పనిచేశారు. అనంతరం ఛత్తీస్ గఢ్, పశ్చిమ బెంగాల్ హైకోర్టుల్లోనూ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. కోలార్ కేజీఎఫ్ లా కాలేజీలో డిగ్రీ చదివిన 1983లో తిరువనంతపురం కోర్టులో ప్రాక్టీస్ మొదలుపెట్టారు. కేరళ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఛైర్మన్‌గానూ పని చేశారాయన. ఆయన మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు.
తెలంగాణ హైకోర్టు తొలి చీఫ్ జస్టిస్ రాధాకృష్ణన్ కన్నుమూత
0
324
Previous article
Next article
Latest Articles
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యల దుమారం
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్ర పూజల వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హరీశ్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపిస్తే... కాదు రేవంత్ రెడ్డే క్షుద్రపూజలు చేస్తున్నారని దాసోజు శ్రవణ్ కౌంటరిచ్చారు. వర్షాలు పడకూడదని,...
- Advertisement -
- Advertisement -


