తిరుమల శ్రీ వారిని సినీ దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో శ్రీవారి సేవలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయం రంగనాయకుల మండపంలో శివకు వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు. ఆలయం అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కొరటాల శివ మాట్లాడుతూ.. ఈ నెల 27న దేవర సినిమా విడుదల కానున్న సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్లు చెప్పారు. శ్రీవారి ఆశీస్సులు తీసుకొని, సినిమా విజయవంతం కావాలని కోరినట్లు కొరటాల శివ తెలిపారు.