మాలీవుడ్‌లో కీచక ఆకృత్యాలను బయటపెట్టిన జస్టిస్ హేమ కమిటీ తరహాలోనే.. తెలంగాణలోనూ ఓ కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సినీ నటి సమంత. జస్టిస్ హేమ రిపోర్టును స్వాగతించిన ఆమె.. కేరళలో WCC చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించారు. మాలీవుడ మాదిరే తెలుగు చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై తెలంగాణ ప్రభుత్వం కూడా దృష్టి సారించాలని.. ఇక్కడ కూడా ఓ కమిటీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేధింపులకు గురి కాకుండా తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం అప్పుడే మహిళా ఆర్టిస్టులకు ఉంటుందన్నారు సమంత.