ఏపీలో భారీ వర్షాలున్న ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకటి, రెండు రోజుల్లో పంపిణీ పూర్తి చేయవచ్చని చెప్పారు. ఈ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురావద్దని, టార్గెట్ పెట్టవద్దని కలెక్టర్లను ఆదేశించారు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలన్నారు.
అక్టోబర్ 2 నుంచి అర్హులైన వారికి కొత్త పింఛన్లు ఇస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. అనర్హుల పింఛన్లు తొలగించాలని యోచిస్తున్నామన్నారు. ఏపీలో పింఛన్ల పంపిణీ వేగంగా సాగుతోంది. ఉదయం నుంచే నగదును లబ్ధిదారులకు అందజేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాలు మినహా ఇతరచోట్ల పంపిణీ చేపట్టారు. సెప్టెంబర్ 1న సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ చేపట్టారు.