పశ్చిమగోదావరిజిల్లా ఆచంట నియోజకవర్గంలో టీడీపీ, జనసేన,బీజేపి ఉమ్మడి అభ్యర్థి మాజీమంత్రి పితాని సత్యనారాయణను గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులే గ్రామగ్రామాన ప్రచారాన్నిహోరెత్తి స్తున్నారు. పితాని కొడుకులు, కోడళ్లు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో మాజీమంత్రి పితాని సత్యనారాయణను భారీ మెజారిటీతో గెలిపించాలని పితాని కొడుకు పితాని వెంకట్ ఆచంట మండలంలో ప్రచారం చేస్తుంటే. పెనుమంట్ర మండలంలో పితాని నాగ సాహితీ, పెనుగొండ మండలం లో పితాని భానుచందర్ పోడూరుమండలంలోని గ్రామాల్లో పితాని నాగస్వాతి ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి పార్టీల మేనిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వం హాయాంలో అభివృద్దికి స్థానిక ఎమ్మెల్యే రంగనాథ రాజు చేసింది ఏమిలేదని ఏకరవు పెడుతున్నారు.
ప్రచారంలో పితాని కుటుంబ సభ్యులు
0
217
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


