స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ ఎన్నికలపై పోటీ చేయట్లేదని YSRTP అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతామని తెలిపారు. YSRTP కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే తమ ఉద్దేశమని షర్మిలా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చితే చరిత్ర నన్ను క్షమించదన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్‌టీపీ పోటీ చేయట్లేదన్నారు వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. తెలంగాణ ప్రభుత్వం కట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు దారుణంగా విఫలమైందని… అలాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించాలని పిలుపునిచ్చారు వైయస్ షర్మిల. కాంగ్రెస్ గెలుపు కోసం తన కార్యకర్తలు మరియు నేతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలని కూడా కోరారు వైయస్ షర్మిల.
పోటీకి దూరం.. వైఎస్ షర్మిల సంచలన నిర్ణయం
0
313
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


